మక్కాలోకి ముస్లిమేతర జర్నలిస్టు ప్రవేశం.. సహకరించిన వ్యక్తి అరెస్టు
- July 22, 2022
సౌదీ: మక్కాలోకి ముస్లిమేతర జర్నలిస్టు ప్రవేశానికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మక్కా పోలీసుల కథనం ప్రకారం.. ఒక నాన్-ముస్లిమేతర అమెరికన్ జర్నలిస్ట్ పవిత్ర నగరమైన మక్కాలోకి ప్రవేశించాడు. అతడి ప్రవేశానికి ఓ సౌదీ పౌరుడు సహకరించాడు. విషయం తెలిసిన తర్వాత.. సదరు సౌదీ పౌరుడిని అరెస్ట్ చేసినట్లు మక్కా పోలీసులు తెలిపారు. ముస్లిమేతరులు పవిత్ర ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధించే నిబంధనలను సౌదీ పౌరుడు స్పష్టంగా ఉల్లంఘించాడని పోలీసులు తెలిపారు. సదరు పౌరుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాజ్యానికి వచ్చే సందర్శకులందరూ పవిత్ర మస్జీదులు, పవిత్ర స్థలాలకు సంబంధించి నిబంధనలను గౌరవించాలని, నిబంధనలకు కట్టుబడి ఉండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..