ఆగష్టులో 13 రోజులు బ్యాంకులకు సెలవులు...

- July 23, 2022 , by Maagulf
ఆగష్టులో 13 రోజులు బ్యాంకులకు సెలవులు...

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగష్టు నెల బ్యాంకు సెలవుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగష్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయనున్నారు. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు.ఈ సెలవులు కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. అటువంటి ప్రాంతీయ పండుగల సందర్భాలలో వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల స్థానిక శాఖలు కూడా మూసివేయనున్నారు.

ఆగష్టులో నెలలో దాదాపు సగం వరకు బ్యాంకులు పనిచేయవు కాబట్టి ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మీరు మీ బ్యాంకు సంబంధిత పనులన్నింటినీ ప్లాన్ చేసుకోవాలని బ్యాంకింగ్ అధికారులు సలహా ఇచ్చారు. సెలవు రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. ఇతర ప్రాంతీయ సెలవుల్లో గణేష్ చతుర్థి, జన్మాష్టమి, షాహెన్‌షాహి, మోహర్రం పండుగలు ఉన్నాయి.


ఆగష్టు 2022 బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇలా ఉంది.బ్యాంకుల సెలవుల జాబితా

ఆగష్టు  1: ఆదివారం
ఆగష్టు  8: ఆదివారం
ఆగష్టు  14: రెండవ శనివారంఆగస్టు 15: ఆదివారం
ఆగష్టు  22: ఆదివారం
ఆగష్టు 28: నాల్గవ శనివారం
ఆగష్టు 29: ఆదివారం

జాతీయ, ప్రాంతీయ సెలవులు
ఆగష్టు  1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం)ఆగస్టు 8, 9: మోహర్రం పండుగ
ఆగష్టు  11, 12: రక్షా బంధన్ ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం
ఆగష్టు  15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు  16: పార్శీల నూతన సంవత్సరం (షాహెన్‌షాహి)ఆగస్టు 18: జన్మాష్టమి
ఆగష్టు 19: శ్రావణ వద్/కృష్ణ జయంతి
ఆగష్టు 20: శ్రీకృష్ణాష్టమి
ఆగష్టు  29: శ్రీమంత శంకరదేవుని తిథిఆగస్టు 31: సంవత్సరం (చతుర్థి పక్షం)/గణేష్ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం/వినాయక చతుర్థి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com