ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా
- July 24, 2022
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా అతడు నిలిచాడు. 2003లో పారిస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో లాంగ్ జంప్‌లో అంజు బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది. మళ్ళీ ఇన్నేళ్ళకు భారత్‌కు పతకం దక్కింది. కాగా, ప్రస్తుత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో ఫైనల్లో గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ అగ్రస్థానంలో నిలిచి, స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పీటర్స్ విసిరిన బల్లెం తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరంలో పడింది. నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అతడు రజతం గెలుచుకున్నాడు. ఇక మూడో స్థానంలో వద్లెచ్ (88.09 మీటర్ల దూరం) నిలిచాడు.
నీరజ్ చోప్రాతో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ రాణించలేకపోయాడు. గతంలో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి నీరజ్ చోప్రా మెరిసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







