కువైట్ నుంచి తెలంగాణకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు
- July 25, 2022
హైదరాబాద్: తెలంగాణలోని కామారెడ్డిలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి రీసెంట్గా కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లుగా తెలిసింది.గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.జులై 6న భారత్కు వచ్చిన మనిషిలో క్రమంగా జ్వరం పెరుగుతుండటంతో జులై 20న హాస్పిటల్ లో చేర్చారు.
జ్వరంతో పాటు ఒంటిపై పొక్కుల వంటివి కూడా కనిపించడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్లు పబ్లిక్ హెల్త్ స్టేట్ డైరక్టర్ జీ.శ్రీనివాసరావు తెలిపారు.ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు.అలా అతణ్ని ఫీవర్ హాస్పిటల్ కు పంపారు.
పేషెంట్ శాంపుల్స్ ను సేకరించి పూణెకు పంపారు. ప్రస్తుతం అతణ్ని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ హెల్త్ మినిష్టర్ టీ హరీశ్ రావు పరిస్థితిని సమీక్షించి తప్పనిసరి చర్యలను వెంటనే తీసుకోవాలని సూచించారు.
“అతనితో ఆరుగురు వ్యక్తులు కాంటాక్ట్ అయినట్లు తెలిసింది. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచాం” అని సీనియర్ హెల్త్ ఆఫీసర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







