ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

- July 25, 2022 , by Maagulf
ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

న్యూ ఢిల్లీ: తెలంగాణ సీఎం ఢిల్లీ బయల్దేరారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ లోనే గడపబోతున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో భేటీ కాబోతున్నారు. జాతీయ స్థాయి నాయ‌కుల‌ను కలవనున్నట్లు తెలుస్తుంది. దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై వీరు చ‌ర్చించున్నారు.

ఇదిలా ఉంటె త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ మద్దతు తెలుపకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మౌనంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. అందువల్లనే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్లు అవుతుందనే భావనతో టీఆర్ఎస్ దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆగస్టు 6న జరిగే పోలింగ్ నాటికి ఉప రాష్ట్రపతికి మద్దతు విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో దీనిపై ఏమైనా ప్రకటన చేస్తారో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com