‘రామారావు ఆన్ డ్యూటీ’లో వేణు తొట్టెంపూడికి అంత సీనుందా.?
- July 25, 2022
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రమోషన్లు జరుగుతున్నాయ్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
ఆ సంగతి అలా వుంటే, ఈ సినిమాలో చాలా కాలం తర్వాత హీరో కమ్ కమెడియన్ వేణు తొట్టెంపూడి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈయన రోల్ సినిమాకి ప్రాణం అని చెబుతున్నారు. హీరోతో సమానంగా ఫుల్ లెంగ్త్ లో వుండబోతోందట వేణు పాత్ర ఈ సినిమాలో.
అంతేకాదు సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూనే బలంగా తిరుగుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత రావడం వల్లనో, లేక నిజంగాన వేణు క్యారెక్టర్‌కి అంత సీనుందో ఏమో తెలీదు కానీ, వేణుని ఈ లోపల ఆకాశానికెత్తేస్తున్నారు.
రవితేజ కూడా వేణు ఈ సినిమాలో నటించినందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. అన్నట్లు అప్పుడెప్పుడో వేణు, రవితేజ కాంబినేషన్ సెట్ అవ్వాల్సి వుందట.
వేణు తొలి సినిమా ‘స్వయంవరం’లో రవితేజ నటించాలట. కానీ, అప్పుడు కుదరలేదట. ఆ కాంబినేషన్ మళ్లీ ఇన్నాళ్లకు ఇలా సెట్ అయ్యిందనీ, ప్రేక్షకులు మా కాంబినేషన్‌ని బాగా ఇష్టపడతారనీ రవితేజ చెప్పడం విశేషం.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







