ఖతార్లో ఉరుములతో కూడిన వర్షం!
- July 26, 2022
దోహా: రేపటి నుండి వారంతం వరకు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని ఖతార్ వాతావరణ విభాగం (క్యూఎండీ) తెలిపింది. అల్పపీడన వ్యవస్థ కారణంగా వారంతంలో పాక్షికంగా మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. దుమ్మువాతావరణం కారణంగా దృశ్యమానత తగ్గుతుందని తెలిపింది. అలాగే గాలి ఈశాన్య దిశ నుండి ఆగ్నేయ దిశలో బలమైన వేగంతో వీస్తుంది. ఇది కొన్నిసార్లు 30 KT వరకు.. సముద్రతీరంలో 40 KT కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పౌరులు, నివాసితులు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఖతార్ వాతావరణ విభాగం కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







