ఢిల్లీ, కేరళ విమానాశ్రయాల్లో హై అలర్ట్
- July 26, 2022
ఢిల్లీ, కేరళ విమానాశ్రయాల వద్ద ఫోకస్ పెరిగింది.మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల్లో వైరల్ లక్షణలు ఉన్నాయా అని పరీక్షలు జరుపుతున్నారు. సమీప లక్షణాలున్నప్పటికీ లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల్ కు పంపిస్తారు.
ఎక్కువగా జ్వరం, నడుంనొప్పి, కండరాల నొప్పి లాంటి లక్షణాలతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎదురైతే ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డుకు పంపిస్తున్నారు. ఇటువంటి పేషెంట్లను ట్రీట్ చేసేందుకు 20మందితో కూడిన టీంను ఏర్పాటు చేశారు.
లక్షణాలతో అనుమానంగా కనిపించిన వ్యక్తులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణెకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులను కలిసి మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో రివ్యూ మీటింగ్ జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా అధికారులను కేంద్రం గైడ్ లైన్స్ అనుసరించాలని ఢిల్లీ గవర్నమెంట్ సూచించింది. అవసరమైతే ఎయిర్‌పోర్టుల్లో మరిన్ని జాగ్రత్తలు దగ్గర్లోని హాస్పిటల్స్ కు పంపాలని ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించింది
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







