కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక..
- July 26, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా రాయబార కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రాయబార కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చేయాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







