మహానటి విలనిజం: కీర్తి సురేష్ అందుకే స్టార్ హీరోయిన్.!

- July 26, 2022 , by Maagulf
మహానటి విలనిజం: కీర్తి సురేష్ అందుకే స్టార్ హీరోయిన్.!

మహానటి సినిమాతో కీర్తిసురేష్ అందరి చేతా ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌లు చూసింది లేదు. అయినా కానీ, ఆమె ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్ రానే లేదు.

ఒకానొక టైమ్‌లో కీర్తి సురేష్ పని ఇక అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ, ‘సర్కారు వారి పాట’ రూపంలో కీర్తి సురేష్‌ని అదృష్టం వరించేసింది మళ్లీ. 

అయితే, అప్పటికే కీర్తి సురేష్ చాలా ఛాలెంజింగ్ రోల్స్ పోషించింది పలు సినిమాల్లో. అందులో ఒకటి ‘చిన్ని’ సినిమా. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కీర్తి సురేష్ చూపించిన హావభావాలకు అందరూ హ్యాట్సాఫ్ అన్నారు.

అంతకు ముందే, ‘రంగ్‌దే’ సినిమాలోనూ కీర్తి డిఫరెంట్ రోల్ పోషించింది. కాస్త నెగటివ్ టచ్ వున్న పాత్రే అది కూడా. ఇక, తాజాగా ‘సర్కారు వారి పాట’ కోసం కూడా కళావతిగా నెగిటివ్ షేడ్సే చూపించింది. దాంతో కీర్తి సురేష్‌కి ఫుల్ లెంగ్త్ నెగిటివ్ షేడ్స్ వున్న ఓ సినిమా ఆఫర్ చేశారట.
ఓ కొత్త డైరెక్టర్, కొత్త కాన్సెప్టుతో రీసెంట్‌గా కీర్తి సురేష్‌ని సంప్రదించాడట. కథ అయితే, కీర్తికి తెగ నచ్చేసిందట. మరి, ఫుల్ లెంగ్త్ విలనిజం అంటే, కీర్తి ఒప్పుకుంటుందా.? పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com