'అఆ' చిత్రం టీజర్ విడుదల
- April 13, 2016
హీరో నితిన్, హీరోయిన్ సమంతా కాంబినేషన్లో తెరకెక్కిన 'అ..ఆ' అనే మూవీ టీజర్ విడుదలైంది. ట్రైన్లో ప్రయాణిస్తున్న హీరో హీరోయిన్లు తమ పేర్లను వెల్లడించిన క్రమంలో సహాయ నటిగా ఉన్న ఓ క్యారెక్టర్ ఇరువురి పేర్లకు ఉన్న సామిప్యతను తెలియజేస్తుంది. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. వీరి పేర్ల మొదటి అక్షరాలే అ, ఆ. పక్కపక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టిందంటూ హీరోయిన్ తన ప్రేమ భావనను వెల్లడిస్తుంది. టీజర్లో ఉన్న ఈ డైలాగ్‌తో దర్శకుడు త్రివిక్రమ్ మరోమారు తనదైన శైలిలో ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న 'అ..ఆ' చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ స్టైల్లో పూర్తి కుటుంబ నేపథ్యంతో వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, అతి త్వరలోనే ఆడియో ఫంక్షన్‌ని నిర్వహించాలని యూనిట్ భావిస్తుందట. ఈ క్రమంలో భాగంగానే మూవీ టీజర్‌ని ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. ఇక ఆడియోను ఈ వారంలో విడుదల చేసి మే నెలలో మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు సమాచారం. అ..ఆ మూవీలో సమంత, ప్రేమమ్ మూవీ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







