ఉత్తరాంధ్రతో పాటు పలు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు
- April 13, 2016
ఉత్తరాంధ్రతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. మయన్మార్ లోని మొనివా నగరానికి 70 కిలో మీటర్ల దూరంలో వాయవ్య ప్రాంతంలో భూకంప కేంద్రం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.దీని ప్రభావం ఏపీ, దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలపై చూపింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. 3 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. నోయిడా, ఢిల్లీ, కోల్ కతా, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కోల్ కతాలో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







