స్కిల్ డేవలెప్మెంట్ జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ
- July 27, 2022
అమరావతి: ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువతకు శిక్షణ మరియు ఉపాధిలో భాగంగా తాడేపల్లి లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ అజయ్ రెడ్డి, సలహాదారు చల్ల మధుసూదన్ రెడ్డి మరియు ఎండీ సత్యనారాయణ జాబ్ క్యాలెండరు ని విడుదల చేసారు.
చల్లా మధుసూధన్ రెడ్డి, సలహాదారు ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ & ట్రైనింగ్ మాట్లాడుతూ...
రాష్ట్రంలో యువతకు సరైన నైపుణ్యం అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఇందులో భాగంగ సుమారు 14 లక్షల మందికి 36 సెక్టార్స్ లో శిక్షణ ఇచ్చాం, మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా మంచి నైపుణ్యం అందేలా చర్యలు తీసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో నైపుణ్యం అందించేందుకు స్కిల్ హబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం, రానున్న రెండేళ్లలో 175 నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయనున్నాం, ఇప్పటికే 15 తాత్కాలిక స్కిల్ కాలేజీల కు బిల్డింగ్స్ ని గుర్తించి, పరిశ్రమలకు అనుగుణంగ కోర్సెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే ఈ ట్రాన్సిట్ స్కిల్ కాలేజెస్ లో శిక్షణని ప్రారంభిస్తాం అని తెలిపారు.
అజయ్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవెలెప్మెంట్ చైర్మన్ మాట్లాడుతూ...ముఖ్య మంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నైపుణ్యాని గ్రామస్థాయికి తీసుకుని వెళ్లడంలో భాగంగ 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 175 స్కిల్ హిబ్స్ ని ప్రారంభించ బోతున్నాం, ఇందులో భాగంగ మొదటి విడత లో 66 స్కిల్ హిబ్స్ ని 1st లో ఆగష్టు 15th న ప్రారంభిబోతున్నాం.మోడల్ స్కిల్ హబ్ ని 15th జులై న గౌరవ మంత్రి వర్యులు విశాఖపట్నం లో ప్రారంభించారు.ఇవే కాకుండా 525 డిగ్రీ కాలేజీ ల ద్వారా, 102 CM సెంటర్ అఫ్ ఎక్ససిల్లాన్స్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రాన్నున్న రోజులలో 26 జిల్లాలో ౩౦౦ కి పైగా జాబ్ మేళలు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లు కండక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కన్ఫ్యూషన్ లేకుండ నెలలు 1 మంగళవారం స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మరియు శుక్రవారం జాబ్ మేళ చేసేలాగా కార్యాచరణ చేయడం జరిగింది అని తెలిపారు.ఈ ఏడాది లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
సత్యనారాయణ, ఏపీ స్కిల్ డెవెలెప్మెంట్ ఎండీ మాట్లాడుతూ...ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ, స్కిల్ హిబ్స్ ద్వారా ఇచ్చే శిక్షణ లో ఇండస్ట్రీ ని భాగస్వామ్యం చేయడం జరిగింది. స్కిల్ హిబ్స్ లో ౩ జాబ్ రోల్స్ ఉంటె 1 లోకల్ ఇండస్ట్రీ డిమాండ్ 2 ఇతర రాష్ట్రాలలో ఉపాధి అవకాశం ఉన్న కోర్సులు ౩ స్వయం ఉపాధి ఉన్న కోర్సెస్ ఎంపిచాకచేయడం జరిగింది అని తెలిపారు. అదే కాకుండా ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు 80 % ఉపాధి కల్పించే లాగా పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవడం మరియు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లో జాబ్ మేళ లు కండక్ట్ చేసేలాగా కేలండర్ తయారుచేయడం జరిగింది అని తెలిపారు. ఇవే కాకుండా APSSDC వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ లో AP తరుపున విజేతలు ఐనటువంటి 17 మందికి నగదు ప్రోత్సహం చేయడం జరిగింది.ఇందులూ 4 గురు ఇంటర్నేషనల్ లో కూడా పాల్గొనబోతున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్వైసర్ SD&T చల్లా మధుసుధన్ రెడ్డి, చైర్మన్ అజయ్ రెడ్డి,ఎండీ సత్యనారాయణ,ED Dr.రామ కోటిరెడ్డి, ED MKV శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







