హెచ్1బీ వీసా లాటరీ ప్రక్రియ పూర్తి
- April 13, 2016
అగ్రరాజ్యం అమెరికా హెచ్1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసింది. 2017 సంవత్సరానికి గానూ హెచ్1 బీ వీసా కోసం మొత్తం 2.36లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వాటి నుంచి నిర్దేశిత 65వేల అప్లికేషన్ల ఎంపిక ప్రక్రియను లాటరీ ద్వారా పూర్తిచేసినట్లు యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) అధికారులు తెలిపారు.అమెరికా ఏటా అనుమతించే 65 వేల హెచ్1బీ వీసాల్లో తొలిప్రాధాన్యంగా 20 వేల వీసాలు ఆ దేశంలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి ఇస్తుంది. మిగిలిన 45 వేల హెచ్1బీలలో అధికశాతం ఐటీ ఫ్రొఫెషనల్స్ కు కేటాయిస్తుంది. ఎప్పటిలాగే హెచ్1బీ పొందినవారిలో భారతీయుల సంఖ్యే అధికంగా ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది హెచ్1బీ అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ద్వారా నిర్వహించే లాటరీలో 65 వేల మందికి వీసా మంజూరవుతుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







