బర్త్ డే స్పెషల్: యాక్టింగ్ అంటే ఇష్టం లేదన్న ధనుష్.!
- July 28, 2022
‘రఘువరన్ బీటెక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న తమిళ హీరో ధనుష్. అంతకు ముందే పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ధనుష్. అసలు యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదట ధనుష్‌కి.
హీరో అంటే ఎలా వుండాలి.. మంచి ఫిజిక్, హ్యాండ్సమ్ లుక్స్.. అవేమీ లేనోడు ధనుష్. ధనుష్ నటించిన తొలి సినిమా సూపర్ హిట్. కానీ, హీరోగా ఫెయిలయ్యాడట. అస్సలు బాగోలేదీ అబ్బాయ్ అనే విమర్శలు ఎదుర్కొన్నాడట.
ఇక అప్పటి నుంచే కసి మొదలైందట. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని ధనుష్, మెల్ల మెల్లగా ఆసక్తి పెంచుకుని సక్సెస్ అయ్యాడు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్తా ఉన్నోడు ధనుష్. తండ్రి కసూర్తి రాజా, అన్నయ్య సెల్వ రాఘవన్ ఇద్దరూ డైరెక్టర్లే. అంతేకాదు, ధనుష్ భార్య (రజనీ కాంత్ తనయ, ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారు) కూడా డైరెక్టరే.
ధనుష్ కేవలం హీరో మాత్రమే కాదు, రైటర్, సింగర్, మ్యూజిక్ మీద మంచి పట్టుంది. సినిమాకి సంబంధించి అన్ని విభాగాల్లోనూ పట్టుంది. తమిళంతో పాటూ, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఇటీవలే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో సందడి చేయబోతున్నారు ధనుష్.
వెంకీ అట్లూరితో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. అలాగే ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఇంకో సినిమా అనౌన్స్ చేశారు ధనుష్. ఈ రోజు ఆయన బర్త్‌డే సందర్బంగా ‘సార్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, ధనుష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపింది టీమ్.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







