మహజూజ్ డ్రా లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
- July 28, 2022
దుబాయ్: దుబాయ్లో భారత ప్రవాసుడికి మహజూజ్ ర్యాఫిల్ రూపంలో అదృష్టం వరించింది.పదేళ్లుగా అక్కడ లేబర్‌గా పనిచేస్తున్న రామనాగిన (44) అనే భారతీయ వ్యక్తికి తాజాగా నిర్వహించిన 86వ మహజూజ్ డ్రా లో జాక్‌పాట్ తగిలింది. ఏకంగా 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు. ఒకేసారి ఇంత భారీ మొత్తం గెలవడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. తాజా డ్రాలో తాను విజేతగా నిలిచిన విషయాన్ని తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న రామనాగిన మొదట నమ్మలేదట. ఏదో ఆట పట్టిస్తున్నాడని అనుకున్నాడు. మిత్రుల సలహా మేరకే ఈ ఏడాది జనవరి నుంచి మహజూజ్ డ్రాలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నట్లు ఈ సందర్భంగా రామనాగిన వెల్లడించాడు. ఇంత భారీ మొత్తం గెలుస్తానని అస్సలు ఊహించలేదని చెప్పిన అతడు.. ఒకేసారి అంతా భారీ నగదు రావడంతో దాంతో ఏం చేయాలో ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పుకొచ్చాడు.
"నేను చాలా అదృష్టవంతుడిని.నా సహోద్యోగుల ద్వారా మహజూజ్ గురించి తెలుసుకున్నాను. జనవరి 2022 నుండి తరచూ డ్రాలో పాల్గొంటున్నాను.కానీ నేను ఇంత గొప్ప బహుమతిని ఇంటికి తీసుకువెళతానని ఎప్పుడూ ఊహించలేదు.ఇంత భారీ మొత్తం గెలిచానని తెలుసుకున్నప్పటి నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు.కల లేక నిజం అనేది ఇప్పటికి అర్థం కావడం లేదు.ఈ డబ్బును ఎలా ఉపయోగించాలో నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ఈ అద్భుతమైన బహుమతికి నేను మహజూజ్‌కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.ఎందుకంటే ఇది నిస్సందేహంగా నా జీవితాన్ని మార్చేస్తుంది" అని రామనాగిన అన్నాడు.ఇక ఇదే డ్రాలో దాయాది పాకిస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు ప్రవాసులు కూడా చెరో లక్ష దిర్హాములు గెలుకున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







