మరో నెల రోజులు శ్రీలంకలో అత్యవసర పరిస్థితి అమలు
- July 28, 2022
కోలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘేబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిరసనకారులు టెంట్లు ఏర్పాటు చేసుకుని ఆందోళన చేపడుతున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల టెంట్లు తొలగించేందుకు రంగంలోకి దిగారు. ఈ మేరకు విక్రమ సింఘే ప్రభుత్వం అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. దీనిపై పార్లమెంట్‌లో ఓటింగ్ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. మరో నెల రోజులపాటు శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని అమలు చేసింది.
కాగా, మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్ పారిపోయారు. జులై 14న మాల్దీవుల నుంచి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు 14 రోజుల పర్యటన పాస్ ఇచ్చింది. ఆగస్టు 11వ తేదీన గొటబయ సింగపూర్ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







