తండ్రిపై న్యాయ పోరాటంలో విజయం సాధించిన కుమార్తె
- July 30, 2022
బహ్రెయిన్: బిడ్డకు బహ్రెయిన్ పాస్‌పోర్ట్ కోసం తన కుమార్తె గుర్తింపు పత్రాలను తన మాజీ భార్య, అరబ్ దేశస్థురాలికి అందజేయడానికి నిరాకరించిన తండ్రిపై ఓ కుమార్తె విజయం సాధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బహ్రెయిన్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి తన పుట్టిన పత్రాలను అందజేయడానికి ఆమె తండ్రి నిరాకరించడంతో కేసు నమోదు చేసింది. బహ్రెయిన్ పాస్‌పోర్ట్ పొందడం ఆమె జన్మహక్కు అని, దానిని ఆమె తండ్రి కాదనలేరని కోర్టు తన తీర్పులో చెప్పింది. బహ్రెయిన్‌లో జన్మించిన తండ్రికి బహ్రెయిన్‌లో జన్మించిన బిడ్డను బహ్రెయిన్ జాతీయుడిగా గుర్తిస్తున్న బహ్రెయిన్ చట్టాన్ని ఉటంకిస్తూ.. బాలిక బహ్రెయిన్ పాస్‌పోర్ట్ పొందేందుకు అర్హులని కోర్టు తీర్పు చెప్పింది. బాలిక తల్లి తరపు న్యాయవాది ఘడా సులైబీఖ్ ప్రకారం.. సదరు బాలిక అమ్మ 2020లో ప్రతివాదిని చట్టబద్ధంగా వివాహం చేసుకుంది. ఆ మహిళ ఇప్పుడు తన భర్త నుండి విడిపోయింది. అయితే, తల్లి తన బిడ్డ కోసం బహ్రెయిన్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ప్రయత్నించినప్పుడు .. తన మాజీ భర్త బాలిక పుట్టుకను రుజువు చేసే చట్టపరమైన పత్రాలను అందజేయడానికి నిరాకరించారు. పాస్‌పోర్ట్ పొందేందుకు ఆ పత్రాలు కీలకం కావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. పత్రాలను అందజేయడాన్ని అడ్డుకోవడం ద్వారా తండ్రి బాలికకు జన్మహక్కును నిరాకరిస్తున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాప తల్లి పాస్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీకి కూడా ఫిర్యాదు చేసింది. బాలిక తన జన్మను కూడా బహ్రెయిన్ లో నమోదు చేసిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. బహ్రెయిన్ చట్టం ప్రకారం "ఎవరైనా బహ్రెయిన్‌లో జన్మించినట్లయితే.. పుట్టిన సమయంలో తండ్రి బహ్రెయిన్‌గా ఉంటే బహ్రెయిన్ జాతీయుడిగా పరిగణించబడతారు. ఇది బహ్రెయిన్ పాస్‌పోర్ట్ పొందే హక్కును రుజువు చేస్తుంది" అని లాయర్ కోర్టు ముందు వాదించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







