సైబరాబాద్ లో CDRF సేవలు ప్రారంభించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

- July 30, 2022 , by Maagulf
సైబరాబాద్ లో CDRF సేవలు ప్రారంభించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని CAR హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర,GHMC-డైరెక్టరేట్ ఆఫ్ EV&DM విశ్వజిత్ కంపాటితో CDRF - (Cyberabad Disaster Response Force) కలిసి ప్రారంభించారు. అనంతరం విపత్తు నిర్వహణ సామగ్రిని విపత్తు నిర్వహణ బృందాలకు అందజేయడం జరిగింది.

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం వర్షాకాలంలో వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు తగు సహాయం చేసేందుకు, గానూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని పోలీసు లతో రెండు బృందాలుగా ఏర్పరిచి, DRF శిక్షణ కేంద్రం నందు తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే విపత్తు నిర్వహణ పరికరాలను అందించడానికి GHMC డైరెక్టర్ (EV&DM) వారి సహకారం తో సైబరాబాద్ పోలీస్ లకు విపత్తు నిర్వహణ పరికరాలను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..సైబరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ కోసం మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్న సుశిక్షితులైన రెండు బృందాల సైబరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏ చేశాం.ఒక్కో బృందంలో 21 మంది సిబ్బంది ఉంటారు.వీరిలో కానిస్టేబుళ్లు, హోం గార్డులు ఉండే ఈ బృందానికి ఆర్ఎస్ఐ ర్యాంక్ అధికారి పర్యవేక్షిస్తారు.ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న రెండు CDRF బృందాలకు అంటే (21+21) 42 మందికి ట్రైనింగ్ ఇప్పించాము. సుశిక్షితులైన  ఈ CDRF సిబ్బంది భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి NDRF బృందాలతో కో-ఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోగలమన్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ EV&DM విశ్వజిత్ కంపాటి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేందుకు తమ తరపున ఏదైనా సహాయం కావాలన్నా,  మరింత మంది సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీతో పాటు జాయింట్ సీపీ అవినాష్ మహంతి,క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వ ర్, GHMC-డైరెక్టరేట్ ఆఫ్ EV&DM విశ్వజిత్ కంపాటి,సి‌ఏ‌ఆర్ హెడ్ క్వార్ట్ ర్స్ ఏడీసీపీ రియాజ్, ట్రాఫిక్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సి‌ఎస్‌డబ్ల్యు ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ లు మట్టయ్య, కృష్ణ, ధనలక్ష్మి, ఇన్‌స్పెక్టర్లు, జి‌హెచ్‌ఎం‌సి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అజయ్, సంతోష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com