‘లైగర్’ విజయ్ దేవరకొండ: రాజువయ్యా మహరాజువయ్యా.!
- July 30, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారి విజయ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇక్కడా అక్కడా, అనే తేడా లేకుండా క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ముంబయ్ ప్రమోషన్లలో బిజీగా వున్న విజయ్ దేవరకొండ, ముంబయ్ ప్రయాణంలో భాగంగా ట్రైయిన్‌లో వెళుతూ హీరోయిన్ అనన్యా పాండే ఒళ్లో పడుకుని వున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ ఫోటోకి విజయ్ ఫ్యాన్స్ మురిసిపోతుంటే, కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయినా, విజయ్ లెక్కే వేరు. యూత్‌ని ఎలా ఎట్రాక్ట్ చేయాలో విజయ్‌కి బాగా తెలుసు. యూత్‌ని ఎట్రాక్ట్ చేసేందుకే ఇలాంటివి చేస్తుంటాడు విజయ్ దేవరకొండ.
తన గత చిత్రాలైన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తదితర సినిమాల టైమ్‌లోనూ విజయ్ ఇలాగే బిహేవ్ చేశాడు. అలాగే యూత్‌లో పాపులారిటీ పెంచుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేతో కలిసి అలాంటి పబ్లిసిటీ స్టంట్సే చేస్తున్నాడు.. అంటూ కొందరు నెటిజన్లు విజయ్‌ని ట్రోల్ చేస్తున్నారు.
అవును మరి, టెక్నిక్.. టెక్నిక్ తెలియాలి బాస్.. అంటూ విజయ్ ఫ్యాన్స్ రౌడీస్ ట్రోలర్స్‌కి ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..