సౌదీలో భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

- July 31, 2022 , by Maagulf
సౌదీలో భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

సౌదీ: భారీ వర్షాల నేపథ్యంలో రాజ్యంలో కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ కోరింది. అసిర్, నజ్రాన్, జజాన్, అల్-బహా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షం పడటంతోపాటు చురుకైన గాలుల వీస్తాయన్నారు. రియాద్, షర్కియా, ఖాసిమ్, హెయిల్ ప్రాంతాలలో మబ్బులు కమ్ముకుంటాయని అథారిటీ తెలిపింది. అధికార ప్రతినిధి కల్నల్ మొహమ్మద్ అల్-హమ్మది మాట్లాడుతూ.. వాతావరణ ప్రమాదాల గురించి జాగ్రత్త వహించాలని కోరారు.  టొరెంట్‌లకు దూరంగా ఉండాలని, వివిధ మీడియా, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ప్రకటించిన పౌర రక్షణ భద్రత సూచనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com