యూఏఈ రెసిడెన్సీ వీసా: 6 నెలలకు మించి యూఏఈ బయట ఉంటే..
- July 31, 2022
యూఏఈ:యూఏఈ రెసిడెన్సీ వీసా కలిగి ఉన్నవారు దేశం బయట ఆరు నెలల దాటి ఉన్నారంటే ఆటోమెటిక్ దాన్ని వాలిడిటీ రద్దు అవుతుంది.అప్పుడు మీరు తిరిగి యూఏఈలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా కొత్త ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే.అయితే, కొన్ని సందర్భాల్లో ఈ నిబంధనకు మినహాయింపులు ఉన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 18న యూఏఈ ప్రభుత్వం తన దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా అయిన గోల్డెన్ వీసా రెసిడెన్సీ పథకంలో కీలక సవరణలు చేసింది.గోల్డెన్ వీసాదారులకు ఆ దేశం బయట 6నెలలకు మించి ఉండరాదు అనే నిబంధనను తొలగించింది.గోల్డెన్ వీసా చెల్లుబాటు అయ్యేంతవరకు వీసాదారులు యూఏఈ బయట ఎంతకాలం ఉన్నాసరే ఎలాంటి ఎంట్రీ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఎంట్రీకి వీలుటుంది.గోల్డెన్ వీసాదారులతో పాటు మరికొన్ని కేటగిరీలకు చెందిన రెసిడెన్సీ వీసా హోల్డర్లకు కూడా ఈ నింబంధన నుంచి మినహాయింపు ఉంది.
వాటిలో ఎమిరాతి పౌరుడిని పెళ్లాడిన విదేశీ మహిళకు ఇది వర్తిస్తుంది.బయటి దేశాల్లో ఎన్నిరోజుల ఉన్నాసరే.. భర్త స్పాన్సర్షిప్ పై ఆమె ఎప్పుడైన యూఏఈ వెళ్లే వెసులుబాటు ఉంది. ఇక చదువులు లేదా వైద్య చికిత్స కోసం ఎమిరాటీస్తో పాటు బయటి దేశాలకు వెళ్లే గృహ సహాయకులకు సైతం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. అలాగే విదేశాలలో యూఏఈ కి ప్రాతినిధ్యం వహిస్తున్న దౌత్య, కాన్సులర్ మిషన్ల సభ్యులతో పాటు ఉండే డొమెస్టిక్ హెల్పర్లు, యూఏఈలో నివాస వీసాలు కలిగి ఉన్న అటువంటి మిషన్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది.
పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న ప్రవాసులను వారి యజమానులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, స్పెషల్ కోర్సుల కోసం విదేశాలకు పంపిస్తే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అలాంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులు చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసాలు కలిగి ఉంటే వారికి కూడా వర్తిస్తుంది. దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకారం విదేశాల్లోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న ప్రవాస విద్యార్థులకు సైతం దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు