కిచ్చా సుదీప్ కు కంగ్రాట్స్ చెబుతూ రాజమౌళి ట్వీట్స్...

- July 31, 2022 , by Maagulf
కిచ్చా సుదీప్ కు కంగ్రాట్స్ చెబుతూ రాజమౌళి ట్వీట్స్...

హైదరాబాద్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కన్నడలో ఈ నటుడి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటుడు తాజాగా నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ'. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ముఖ్య పాత్రలో నటిస్తోంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 28న విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో పలువురు ప్రముఖులు ఈ సినిమా టీం, హీరో సుదీప్‌కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సైతం సుదీప్‌కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.

రాజమౌళి చేసిన ట్వీట్‌లో.. ‘విక్రాంత్ రోణ సూపర్ హిట్ కొట్టింది. కంగ్రాట్స్ కిచ్చా సుదీప్. అలాంటి డిఫరెంట్ లైన్‌ని నమ్మి పెట్టుబడి పెట్టి, సినిమా తీయడానికి చాలా ధైర్యం, నమ్మకం కావాలి. మీరు అది చేశారు. దానికి ఫలితం కూడా అందుకున్నారు. ప్రీ క్లైమాక్స్ ఈ సినిమాకి గుండెలాంటి. ఎంతో అద్భుతంగా ఉంది. అందరిని ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా మిత్రుడు భాస్కర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి’ అని రాసుకొచ్చాడు.

 

 

దీనిపై సుదీప్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ నుంచి ఇలాంటి మాటలు వినడం చాలా గర్వంగా ఉంది. భాస్కర్‌తో కలిపి మా అందరి నుంచి చాలా చాలా కృతజ్ఞతలు అందుకొండి’ అని ఎంతో ఆనందంతో రిప్లై ఇచ్చాడు. కాగా.. విక్రాంత్ రోణ కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. విడుదలైన ప్రతి చోటా మంచి టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అన్ని భాషల్లో కలిపి మొదటి రెండూ రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్ల పైగా వసూళ్లని ఈ మూవీ సాధించింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com