ప్రొఫెసర్ విశ్వామిత్ర గా డా.మంచు మోహన్ బాబు

- July 31, 2022 , by Maagulf
ప్రొఫెసర్ విశ్వామిత్ర గా డా.మంచు మోహన్ బాబు

హైదరాబాద్: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు (31.7.2022) డా.మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నారు మోహన్ బాబు. 

ప్రొఫెసర్ విశ్వామిత్ర క్యారెక్టరైజేషన్ డిటైల్స్ లోకి వెళితే...
తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల... డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్ మరియు ప్రొఫెసర్. గంభీరమైన లుక్ తో మోహన్ బాబు గారు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారని లుక్ ని చూస్తే అర్ధమవుతోంది. 
ఫస్ట్ టైమ్ డా. మోహన్ బాబు, ఎవర్ ఛార్మింగ్ మంచు లక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర చేస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా నటిస్తున్నారు.
చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com