నందమూరి బాలకృష్ణకు సినారె స్వర్ణకంకణం...
- August 01, 2022
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వంశీ ఆర్ట్ థియేటర్, హైదరాబాద్ వారు, శుభోదయం గ్రూపు, సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి 91వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ కు "సినారె- వంశీ - శుభోదయం జీవన సాఫల్య జాతీయ స్వర్ణ కంకణ పురస్కార ప్రదానోత్సవం" జులై 30న రవీంద్రభారతి, హైదరాబాద్ లో అత్యద్భుతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర పూర్వ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, తాతాజీ ఉసిరికల, తాతాజీ పద్మజ, ఖతార్ నుంచి వేణుగోపాల్ హరి పాల్గొన్నారు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సినారె గీతాలతో రవీంద్ర భారతి పులకరించిపోయింది.. సహజ గాయని సుజా రమణ మరియు శివశంకరి గీతాంజలి నేతృత్వంలో పాటల కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.
ప్రతి సంవత్సరం వంశీ సంస్థకు సినారె అందించిన సేవల గురించి వేదికపై వంశీ రామరాజు గారు తలుచుకుంటూనే ఉంటారు.. వేగేశ్న వికలాంగుల ఆశ్రమంలో సినారె, అక్కినేని, దాసరి, సుబ్బిరామిరెడ్డి, జమున గార్లు తనకు అందించిన సహకారం ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు.. "ఎవరికైనా సహాయం చేస్తే మరచిపో.. కానీ ఎవరైనా సహాయం చేస్తే గుర్తుపెట్టుకో.."అనే తన సిద్ధాంతం రామరాజు గారు ప్రతి సమావేశంలో ఉటంకిస్తూ ఉంటారు..
ముఖ్యఅతిథి విద్యాసాగర్ రావు తెలుగు భాష ఔన్నత్యాన్ని సినారె ఎలా ముందుకు తీసుకెళ్లారు వివరించారు.. తెలుగు నిషేధించిన ప్రాంతంలో పుట్టి ఉర్దూలో చదివి తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లిన కవి సినారె.. సినారె రచనలపై రీసెర్చ్ చేసే అవకాశం కొంతమందికైనా కల్పించమని సినారె కుటుంబ సభ్యులను కోరారు... సమయ సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా బోధించిన కవి సి నారాయణ రెడ్డి.
బాలకృష్ణ గారిని స్టేజి మీద చూడగానే "జై బాలయ్య" అంటూ అభిమానులు హర్షద్వానాలతో బాలయ్యకు స్వాగతం పలికారు.. ఈ పురస్కారం తనపై ఎంతో బాధ్యతను పెట్టింది అని చెప్పారు.. "స్నేహమేరా జీవితం.." అంటూ ఒక చరణం పాడుతూ నాన్నకి, సినారెకి ఉన్న స్నేహాన్ని ఇలా స్నేహితుల దినోత్సవం రోజున జరపటం తనకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.. మీ అందరి ఆశీస్సులతో ఇంకా మంచి సినిమాలు చేస్తానని తెలియజేశారు.జోహార్ ఎన్టీఆర్... జోహార్ సినారె.. నినాదం రవీంద్రభారతిలో మారుమ్రోగింది.
వంశీ - శుభోదయం తరఫున "అఖండ" సినిమాలో అద్భుతంగా నటించిన బాలకృష్ణ కి ఉత్తమ నటుడు అవార్డును వంశీ రామరాజు ప్రకటించారు.. డాక్టర్ చెన్నయ్య అభినందన పత్రం చదివారు.
ఈ కార్యక్రమంలో మాధవ పెద్ది సురేష్, డాక్టర్ గురువారెడ్డి, వేణుగోపాల్ హరి, సినారె మనవడు లయచరణ్ మాట్లాడారు.
50 సంవత్సరాలుగా సంగీత, సాహిత్య సేవలు చేస్తూ దివ్యాంగులకు, వీధి బాలలకు వెలుగు చూపించిన వంశీ రామరాజు సుధాదేవి దంపతులను సినారె కుటుంబ సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు.
సినారె గీతాలలో అపర ఘంటసాల డి ఎ మిత్రా పాటలు నాటి సినారె యుగాన్ని గుర్తు చేశాయి.
వైయస్ రామకృష్ణ, వినోద్ బాబు, బాలకామేశ్వరరావు, సుధాకర్, గీతాంజలి, విజయలక్ష్మి, సుజా రమణ, శ్యామల సినారె గీతాలు వీనుల విందుగా వినిపించారు.
ప్రముఖ గాయని గీతాంజలి తనయుడు 8 సంవత్సరాల విజయ హర్ష సినారె గీతాలు ఆలపించి అందరిని ముగ్దులను చేశాడు.
వేగేశ్న ఆశ్రమంలో దివ్యాంగుల సేవకు అంకితమైన సుంకరపల్లి శైలజ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆద్యంతం విజయవంతంగా, ఆసక్తికరంగా సాగింది.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు