కార్మికుల హక్కులను వెల్లడించిన MHRSD
- August 01, 2022
రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) 11 కార్మికుల హక్కులను వెల్లడించింది. వీటిని యజమానులు ఉల్లంఘించినట్లయితే అక్రమ రవాణాలో భాగంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. ప్రతి కార్మికుడు తన అధికారిక పత్రాలను కలిగి ఉండాలని పేర్కొంది. అలాగే పని ఒప్పందం కాపీని కార్మికుడికి చదివే హక్కు ఉందని తెలిపింది. కార్మికుడు తన అధికారిక పత్రాలను పునరుద్ధరించడానికి ఆర్థిక రుసుములను వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతోపాటు కార్మికుడు తన యజమానికి కాకుండా మరొకరికి పని చేయడానికి నిరాకరించే హక్కును కలిగి ఉంటాడని తెలిపింది. వీటితోపాటు ప్రయాణ టిక్కెట్ల విలువ, ఫైనల్ ఎగ్జిట్.. అలాగే సేవల బదిలీని పొందే హక్కు కార్మికుడికి ఉంటుందని పేర్కొంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో లేదా చెడు వాతావరణ పరిస్థితుల్లో పని చేయడానికి నిరాకరించే హక్కు కూడా కార్మికుల హక్కులలో ఉందని MHRSD తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!