రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారధి'
- August 01, 2022
సింగపూరు: సింగపూరు'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, కార్యవర్గ సభ్యులందరూ కలిసి "మా రెండేళ్ల ప్రయాణం" అనే కార్యక్రమం నిర్వహించారు.
సింగపూరు తెలుగు సౌరభాలను విశ్వవ్యాప్తంగా విరజల్లుత, సంస్థ స్థాపించిన మొదటి రోజు నుండీ సింగపూరు నందు నిక్షిప్తమైన తెలుగు సాహితీ సంపదను, కళాకారులను, సాహితీ వేత్తలనూ వెలుగులోనికి తెస్తూ, ఎందరో తెలుగు ప్రముఖులచేత కొనియాడబడుతున్న సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారధి".
సాంకేతికపధంలో నడుస్తూ ప్రాచీన తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక, కళారంగాలకు చెందిన విన్నూత్న కార్యక్రమాలను ప్రపంచ నలుమూలలకూ చేరేలా నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. సింగపూరులో 'తెలుగు' అనగానే ప్రపంచం మొత్తం తలచుకునే పేరు 'శ్రీ సాంస్కృతిక కళాసారధి'. అతి స్వల్పకాలంలోనే అంతటి స్థానం సంపాదించింది అంటే దానివెనుక ఎంత నిబద్దత, ఎంత కృషి ఉందో అందరూ తెలుసుకునేలా సంస్థ ప్రధాన ప్రధాన కార్యవర్గ సభ్యుల అంతరంగాలను ఆవిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంస్థ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యవర్గ సభ్యులు రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాలను నిర్వహించడం వెనుక తమ కృషి, ఎదుర్కొన్న సవాళ్లు, రూపకల్పన విధానం, సాంకేతిక ఇబ్బందులు గురించిన ఎన్నో విషయాలను అందరితో పంచుకున్నారు.
తమ రెండేళ్ల ప్రస్థానంలో తమ సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, వారి నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వైవిధ్యభరితమైన ప్రతిష్టాత్మక కార్యక్రమాలనుండి, 24 గంటల నిర్విరామ అంతర్జాల కార్యక్రమాల వరకు నిర్వహించడంలో తెరవెనుక ఆసక్తికరమైన కబుర్లు పంచుకుంటూ, తమ కార్యక్రమాలను ఆశీర్వదించిన పీఠాధిపతుల నుండి లబ్ద ప్రతిష్టలైన ప్రముఖుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
సమన్వయకర్తగా సుబ్బు వి పాలకుర్తి వ్యవహరించగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..