జూన్ మొదటి వారంలో కబాలి రిలీజ్
- April 13, 2016
ఈమధ్య సినిమాల విడుదలపై ప్రకటనలు, వాయిదాలు ఎక్కువయ్యాయి. మంచి డేట్ దొరికింది, ఎక్కడా పోటీ లేదు, ఏ ఆటంకమూ లేదు అనుకునే సరికి ఏదోక అవాంతరం వస్తూనే ఉంటుంది. నిజానికి ఈ తతంగం ఇలా నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పోటీ మరింత ఎక్కువైంది. ఈ నెల 22న అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా విడుదలవుతోంది. ఆ వెంటనే వరసగా మూడు తమిళ సినిమాల తెలుగు వెర్షన్స్ విడుదల డేట్స్ రావడంతో సరైనోడు కలెక్షన్స్ ఎలా ఉంటాయోనన్న డౌట్ వచ్చిందట.సరైనోడు మూవీ తర్వాత వరసగా ... 24, కబాలి తమిళ సినిమాల తెలుగు వెర్షన్స్ రిలీజ్ కాబోతున్నాయి. సరైనోడు పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఆ మూవీ మేకర్స్ కాస్త నిరాశకు గురైనట్టు కనిపించింది. కబాలి పై ఇప్పటికే అంచనాలు భారీగా వచ్చేయడంతో సరైనోడు కలెక్షన్స్ తగ్గుతాయేమో అనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల కబాలి రిలీజ్ పోస్ట్ పోన్ కావచ్చని మూడు నాలుగు రోజుల కిందట ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేసింది. దాంతో రజనీకాంత్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు.కబాలి వాయిదా పడిందన్న న్యూస్ సరైనోడు మూవీకి సంబంధించిన వారిలోనూ, బన్నీ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమ హీరో సినిమా కలెక్షన్స్ కి తిరుగులేదనుకున్నారు. కానీ అంతలోనే మరో వార్త వచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ - కబాలి విడుదల వాయిదా పడదని, మే చివర్లో కానీ, జూన్ మొదటి వారంలో కానీ కబాలి రిలీజ్ అవుతుందని రజనీకాంత్ స్వయంగా ప్రకటించాడు. దాంతో రజనీ అభిమానుల్లో ఉత్సాహం చిగురులు వేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







