యూఏఈ: 10వేల మంది భారతీయు కార్మికులకు ఉద్యోగాలు..
- August 02, 2022
దుబాయ్: యూఏఈలోని భారత కాన్సులేట్ వచ్చే ఏడాది ఆ దేశంలో కనీసం 10వేల మంది మంచి నైపుణ్యం కలిగిన ఇండియన్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) ప్రాజెక్ట్ ద్వారా ఇలా భారీ సంఖ్యలో భారత ప్రవాసులకు ఉపాధి కల్పించనున్నట్లు ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్‌లోని కాన్సుల్ (ప్రెస్, ఇన్ఫర్మేషన్, కల్చర్ & లేబర్) తాడు మాము అన్నారు. ఇటీవలి కాలంలో ప్రవాసులు ఏజెంట్ల ద్వారా విదేశాలకు వచ్చి మోసపూరిత నియామకాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ (NSDC)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి కాన్సులేట్ శ్రీకారం చుట్టింది. NSDC కు చెందిన సిబ్బంది యూఏఈలో వివిధ రంగాలలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలను తెలుసుకుని వాటికి తగ్గటుగా ప్రవాసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.హెల్త్‌కేర్, రిటైల్ తదితర రంగాలలో ఇలా ప్రవాసులకు శిక్షణ ఇచ్చి అనంతరం వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.ఈ ఏడాది మార్చిలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభించడం జరిగింది.ఇక ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) శిక్షణ కార్యక్రమం అనేది ఇటు భారత్‌తో పాటు అటు దుబాయ్‌లో కూడా నిర్వహించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..