ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు
- August 02, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో రెండోమంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల నైజీరియన్ మంకీ పాక్స్ బారిన పడ్డాడు. ఇటీవల అతను విదేశీ ప్రయాణాలు ఏమీ చేయలేదని తెలిసింది. దేశంలో మంకీ పాక్స్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంకీ పాక్స్ లక్షణాలు సోకిన నైజీరియన్ ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత ఐదు రోజులుగా జ్వరం, బొబ్బలతో బాధపడుతున్నాడు. అతని వద్ద నుంచి సేకరించిన రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపారు.
అతడికి మంకీ పాక్స్ సోకినట్లు సోమవారం రిపోర్టు వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆఫ్రికా ఖండ సంతతికి చెందిన మరో ఇద్దరు అనుమానిత రోగులు కూడా లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా మంకీ పాక్స్ సోకి ఉండొచ్చునని భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మొదటి మంకీ పాక్స్ కేసు జులై 24న నమోదయ్యింది. కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. అందులో 22 ఏళ్ల యువకుడు మంకీ పాక్స్ వ్యాధితో మరణించాడు. రాజస్ధాన్ లోని కిషన్ గఢ్ కు చెందిన 20 ఏళ్ళ యువకుడికి మంకీపాక్స్ సోకింది. అతడిని జైపూర్ లోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..