భారత్ కరోనా అప్డేట్
- August 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.34 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
నిన్న కరోనా వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,430కు చేరింది. దేశంలో నిన్న 4,11,102 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87.58 కోట్లకు చేరినట్లు వివరించింది. దేశంలో నిన్న 26,77,405 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.6 కోట్లకు చేరిందని వివరించింది. వాటిలో రెండో డోసు 93.33 కోట్లు, బూస్టర్ డోసు 9.28 కోట్లు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..