కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
- August 02, 2022
కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. యూఏఈ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ గా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో భారత్ లో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఢిల్లీలో రెండు కేసులు నమోదు కాగా..కేరళలో కొత్తగా నమోదు అయిన కేసుతో కలిపి భారత్ లో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.యూఏఈ నుంచి గత నెల 27న కోజికోడ్ విమానాశ్రయంలో దిగిన 30 ఏళ్ల యువకుడిని వచ్చాడు. కోజికోడ్ విమానాశ్రయంలో అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో మంకీ పాక్స్ గా తేలంది. దీంతో అతనిని మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
అతని శరీరంపై దుద్దుర్లు రావడం, జ్వరం కూడా ఎక్కువగా రావడంతో అతని రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా మంకీపాక్స్ అని నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇందులో కేరళ నుండి ఐదు కేసులు నమోదు కాగా, ఢిల్లీ నుండి రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
కాగా దేశంలో తొలి మంకీపాక్స్ కేసు కేరళలోనే నమోదయింది. ఆ తర్వాత నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కేరళలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తొలిసారి మంకీపాక్స్ సోకిన వ్యక్తికి కేరళ వైద్యులు చికిత్స అందించారు. ఆయన కోలుకున్నారు. అతనికి నెగిటివ్ వచ్చింది. దీంతో కొంత ధైర్యం వచ్చిన వైద్య శాఖ మంకీపాక్స్ సోకిన వారి కోసం ప్రత్యేక వార్డులను ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







