TCSలో ఇంటర్న్ షిప్ అవకాశాలు
- August 02, 2022
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్, బీఈ, ఇతర కోర్సులు చదువుతున్నవారు టీసీఎస్‌లో ఇంటర్‌షిప్ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకునేవారు టీసీఎస్ ఇంటర్న్‌షిప్ 2022 ప్రోగ్రామ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లాంటి సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు 6 వారాల నుంచి 8 వారాల షార్ట్ ఇంటర్న్‌షిప్, 16 వారాల నుంచి 18 వారాల లాంగ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అవసరమైతే ఇంటర్న్ షిప్ వ్యవధిని మార్చుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో, సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం, ప్రోటోటైప్ రూపొందించడం, పరిశోధనా పత్రాలను ప్రచురించడం, రీసెర్చ్ ఎగ్జిక్యూషన్, సర్వేలు నిర్వహించి అవకాశాలు, సవాళ్లను గుర్తించడం లాంటి వాటిలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలి. ఇతర వివరాలకోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించాలి. పూర్తి వివరాలకు http://https://www.tcs.com పరిశీలించగలరు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..