అచ్యుతాపురం గ్యాస్ లీక్..కంపెనీ మూసివేతకు ఆదేశాలు: ఏపీ మంత్రి
- August 03, 2022
అమరావతి: ఏపిలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకైలీకై అస్వస్థకు గురైన 95 మంది మహిళా కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. అయితే బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. సీడ్స్ కంపెనీ మూసేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని, సీడ్స్ కంపెనీకి నోటీసులు ఇచ్చామని, తప్పు జరిగితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనని తెలిపారు. ఇదే కంపెనీలో అంతకుముందు కూడా గ్యాస్ లీకైందని మంత్రి వెల్లడించారు.
అప్పుడు ఏసీ డెక్‌లలో క్రిమి సంహారక మందులు కలవడం వల్ల కాలుష్యం లీకై గ్లోరిఫై పాలీస్ అనే రసాయనం వెలువడినట్లు తెలిసిందని వివరించారు. ఈసారి కారణం నిర్ధారణ కావాల్సి ఉందని అన్నారు.యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వం చర్యా అనేది తేలాలని అన్నారు. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్ లేకపోతే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు నమూనాలు పంపుతున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా రసాయనాలు లీకైన సీడ్స్ కంపెనీలో అధికారులు ఇవాళ నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







