యాత్రికులకు PCR పరీక్ష తప్పనిసరి కాదు: హజ్ మంత్రిత్వ శాఖ

- August 03, 2022 , by Maagulf
యాత్రికులకు PCR పరీక్ష తప్పనిసరి కాదు: హజ్ మంత్రిత్వ శాఖ

రియాద్: విదేశాల నుండి ఉమ్రా చేయాలనుకునే యాత్రికులు సౌదీ అరేబియాలో ప్రవేశించడానికి PCR పరీక్ష అవసరం లేదని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అయితే, COVID-19 వైరస్ బారిన పడిన సందర్భంలో చికిత్స ఖర్చులను కవర్ చేయడానికి బీమా జారీ చేయడం ఇప్పటికీ ఉమ్రా షరతుగానే ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉమ్రా వీసాపై వచ్చే వారి బస వ్యవధి 90 రోజులు మాత్రమేనని, యాత్రికుడు మక్కా, మదీనా, అన్ని ఇతర సౌదీ నగరాల మధ్య ప్రయాణించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.విదేశీ యాత్రికుల కోసం ఉమ్రా ట్రిప్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ డిజైన్‌ను మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో యాత్రికులు నేరుగా మధ్యవర్తి లేకుండా ఉమ్రాను కింది లింక్ ద్వారా https://maqam.gds.haj.gov.sa/Home/OTAsబుక్ చేసుకోవచ్చు.టీకాలు వేయని వ్యక్తులు మక్కాలోని గ్రాండ్ మస్జీదులో ప్రార్థన చేయడానికి అనుమతించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకాలు వేసుకోని యాత్రికులు ఈట్‌మార్నా యాప్ ద్వారా ఉమ్రా పర్మిట్‌లను పొందే అవకాశం ఉందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com