దుబాయ్ రోడ్లపై రేసింగ్: 30 మంది అరెస్ట్
- April 13, 2016
దుబాయ్ రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడుతున్న 30 మందిని అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు. తొలి క్వార్టర్లో ఈ 30 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తమ విన్యాసాలతో రోడ్లపై ప్రయాణించే ఇతర వాహనాలకు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారని అరెస్టయినవారిపై అభియోగాలున్నాయి. ఎమిరేట్‌లో 391 అఫెన్సెస్ నమోదయ్యాయనీ, ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయని దుబాయ్ అసిస్టెంట్ పోలీస్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ జఫిన్ చెప్పారు. 1000 నుంచి 2000 దిర్హామ్‌ల వరకు జరీమానా అలాగే 12 వరకు బ్లాక్ పాయింట్స్, వెహికిల్‌ని సీజ్ చేయడం వంటి చర్యలు నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. 2016 తొలి క్వార్టర్లో 1.368 మిలియన్ అఫెన్సెస్ దుబాయ్‌లో నమోదయ్యాయని, వీటిల్లో 776,000 వేగానికి సంబంధించిన నేరాలేననీ, 16,938 మొబైల్ ఫోన్ ఎబ్యూజెస్, 19,000 సీట్ బెల్ట్ వయొలేషన్స్, 680 జంపింగ్ రెడ్ లైట్ సిగ్నల్ కేసులు, ఆల్కహాల్ సేవించి వాహనాలు నడిపిన కేసులు 327 ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







