హైకోర్టు నూతన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఏపీ గవర్నర్
- August 04, 2022
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులతో గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్,వూటుకూరు శ్రీనివాస్‌లతో గవర్నర్ హరిచందన్ తొలుత ప్రమాణ స్వీకారం చేయించారు.అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పన వరాహలక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లిఖార్జునరావు,దుప్పల వెంకట రమణ అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాల రాజు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్, ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







