అన్నయ్య గురించి ఆలోచించడం అంటే చాల పెద్ద బాధ్యత : పవన్
- April 14, 2016
'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల తరువాత పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూలతో మీడియా హోరెత్తి పోతోంది. లేటెస్ట్ గా మరో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తన అన్న చిరంజీవి 150వ సినిమా విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యాలు చాలామందిని ఆశ్చర్య పరిచాయి. ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న మీడియా సంస్థ ప్రతినిధి చిరంజీవి 150వ సినిమాకు సాయం చేస్తారా ? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ చిరంజీవి గురించి ఆలోచించడం అంటే చాల పెద్ద బాధ్యత అని అంటూ తేడా వస్తే మెగా అభిమానులు తనను పాతేస్తారు అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు పవన్.
ఇదే సందర్భంలో హాలీవుడ్ హీరోయిన్ ఎలిజిబెత్ టేలర్ అన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకుందా అని తాను అనుకునే వాడిని అని అంటూ తన జీవితంలో కూడ ఏకంగా మూడు పెళ్ళిళ్ళు జరుగుతాయని తానెప్పుడు ఊహించుకోలేదు అంటూ మరో సెటైర్ పేల్చాడు పవన్. ఇక తన వ్యక్తిగత అలవాట్లను గురించి మాట్లాడుతూ తాను గ్యాడ్జెట్స్ ఒక స్థాయికి మించి వాడను అని అంటూ రోజుకొక కొత్త వెర్షన్ వస్తున్న నేపధ్యంలో వాటన్నిటినీ తెలుసుకొని, వాడటం అంటే విసుగు అనిపిస్తుందని కామెంట్ చేసాడు పవన్.అంతేకాదు అప్పుడప్పుడు తనకు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోవాలి అని అనిపిస్తోంది అని అంటూ తనకు ఏదైనా వ్రాయాలి అనిపిస్తే నోట్స్లోనే రాసుకుంటాను తప్ప కంప్యూటరూ, ఇతరత్రా విషయాల జోలికి వెళ్లను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్. తాను కంప్యూటర్ ఓపెన్ చేసి అందరి ట్విటర్ ఎకౌంట్లు చూస్తూ ప్రతీ రోజూ ఎవరేం మాట్లాడారో చూడటం తనకు చేతకాని పని అని కామెంట్ చేసాడు.'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో తన పొలానికి కూడ వెళ్ళడం మానివేసానని ఈసారి తన పొలంలో మామిడి చెట్లకు తెగుళ్ళు వచ్చి పూత, పిందె రాలిపోవడంతో ఈసారి ఎవ్వరికీ మామిడి పండ్లు పంపలేనని సెటైర్లు వేసాడు పవన్. ప్రతిసారీ జుత్తుకు రంగేసుకొని, మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వెళ్లాలంటే ఏదో తెలియని విసుగు తనకు కలుగుతోంది అని అంటూ సూటూ బూటూ వేసుకోవాలని, హంగులతో ఆర్భాటంగా కనిపించాలని తనకు కోరిక ఉన్నా తాను ఎక్కడకు వెళ్ళాలి అంటూ భావయుక్తంగా ఆ ఇంటర్వ్యూ ముగించాడు పవన్..
తాజా వార్తలు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్







