యూఏఈ: రెసిడెన్సీ వీసా కోసం తప్పనిసరిగా ఆరు మెడికల్ టెస్టులు
- August 06, 2022
యూఏఈ: యూఏఈ వచ్చే ప్రవాసులకు ప్రభుత్వం కొత్త షరతు విధించింది.రెసిడెన్సీ వీసా కోసం తప్పని సరిగా ఆరు మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది.ఈ నేపథ్యంలో యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ (DGOV) తన అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను తెలియజేస్తూ కీలక ప్రకటన చేసింది.విదేశాల నుంచి వచ్చే నాన్-ఎమిరాతీలకు కొత్త రెసిడెన్సీ వీసా లేదా వీసా రెన్యూవల్ కోసం ఆరు వైద్య పరీక్షలు ఉంటాయని తన ప్రకటనలో పేర్కొంది.వీటి ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన తర్వాతే రెసిడెన్సీ వీసా తదుపరి ప్రాసెస్ చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. విదేశీయులు వర్క్/రెసిడెన్సీ పర్మిట్లు పొందాలంటే వారికి హెచ్ఐవీ, టీబీతో పాటు ఇతర అంటువ్యాధులేవీ ఉండకూడదని డీజీఓవీ (DGOV) తెలియజేసింది.
ఇక ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు, డ్రైవర్లతో పాటు రెస్టారెంట్, కేఫ్‌లు, సెలూన్స్, బ్యూటీ పార్లలు, హెల్త్ క్లబ్స్‌లో పనిచేసే వారికి తప్పని సరిగా సిఫిలిస్, హెపటైటిస్ బీ నెగెటివ్‌గా ఉండాలని పేర్కొంది.అలాగే మహిళా గృహ కార్మికులకు ప్రెగ్నెన్సీ టెస్టులో నెగెటివ్ రావాలని తెలిపింది. కాగా, 2016లో ఆ దేశ క్యాబినెట్ ఆమోదించిన తీర్మానం ప్రకారం రెసిడెన్సీ వీసాలను పునరుద్ధరించే సమయంలో నివాసితులందరూ టీబీ స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి అనే విషయం తెలిసిందే.టీబీ యాక్టివ్ ఉన్నవారికి లేదా డ్రగ్-రెసిస్టెంట్ టీబీ ఉన్నవారికి షరతులతో కూడిన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.అలాగే కేవలం ఏడాది గడువుతో మాత్రమే నివాస వీసా జారీ చేయబడుతుంది.ఆ తర్వాత వారు యూఏఈలో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా డిజిటల్ గవర్నమెంట్ (DGOV) మరికొన్ని కీలక సూచనలు చేసింది. కొన్ని ఉద్యోగాలకు అకడమిక్ సర్టిఫికేట్లు తప్పనిసరి అని పేర్కొంది.ఇక యూఏఈ చట్టం పర్యాటక లేదా టూరిజం పర్మిట్ కింద వేతనం కోసం లేదా లేకుండా పని చేయడాన్ని నిషేధిస్తుంది. ఇలాంటి సందర్భంలో కార్మికుడు లేదా పని కల్పించిన యజమాని నేరస్థుడిగా నిర్ధారణ అయితే దేశ బహిష్కరణ, జరిమానా ఉంటాయని వివరించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







