ఏడు రాష్ట్రాల్లో పది శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు..
- August 06, 2022
న్యూఢిల్లీ: మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో వారాంత కరోనా పాజిటివిటీ రేటు పది శాతానికిపైగా ఉన్నది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఈ ఏడు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఐదు రెట్ల వ్యూహాన్ని అమలు చేయాలని, కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించాలని తెలిపారు. అలాగే అర్హులకు కరోనా టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
మరోవైపు రానున్న నెలల్లో పలు పండుగలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో జన రద్దీ, సామూహిక కార్యక్రమాలు మరింతగా పెరుగుతాయి. దీంతో కరోనా వైరస్ మరింతగా వ్యాపించే అవకాశమున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు రాష్ట్రాలను హెచ్చరించింది. కరోనా కేసులు, మరణాలు పెరుగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







