దక్షిణ అల్ బతినా లో సేవలు పునరుద్ధరణ

- August 06, 2022 , by Maagulf
దక్షిణ అల్ బతినా లో సేవలు పునరుద్ధరణ

మస్కట్: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న వాతావరణ మార్పులు చేర్పులు కారణంగా దక్షిణ అల్ బతినా మౌలిక వ్యవస్థలు మొత్తం చిన్నా భిన్నం అయిన సందర్భంగా తిరిగి ఆ వ్యవస్థలను పునరుద్ధరణ చేశారు. 

 జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ సేవల రంగం అధ్యక్షుడు మరియు సేవల నియంత్రణ విభాగం ఛైర్మన్ షేక్ డాక్టర్ మన్సన్ తాలిబ్ అల్ హనై మాట్లాడుతూ  దక్షిణ అల్ బతినా లోని విలయాత్ అఫ్ రుస్తుక్ మరియు అల్ అవాబి ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి అవుతున్నట్లు తెలిపారు. 

త్వరలోనే ఈ ప్రాంతాల్లో రోడ్డు మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com