కామన్వెల్త్ క్రీడలు..స్వర్ణం సాధించిన పీవీ సింధు
- August 08, 2022
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో తెలుగుతేజం పీవీ సింధు పసిడి పతకం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది.
బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ అంశంలో సింధుపై మొదటి నుంచి పసిడి ఆశలు ఉన్నాయి. ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది. అటు అభిమానులు కూడా సింధు కామన్వెల్త్ స్వర్ణం అందుకోవాలని ఆకాంక్షించారు. అందరి అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ సింధు కామన్వెల్త్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా అవతరించింది.
కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణ పతకం. ఈ పతకంతో బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 56కి పెరిగింది.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం







