ఆరో బిగ్‌బాస్: ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా వుండదు.!
- August 09, 2022
బుల్లితెర మెగా గేమ్ షో ‘బిగ్‌బాస్’ ఆరో సీజన్‌కి ముస్తాబవుతోంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్ అంతగా ఆదరణ దక్కించుకోకపోయినా, బుల్లితెరపై బిగ్‌బాస్ షోకి వున్న కిక్కే వేరప్పా.
వివాదాలు చుట్టుముట్టినా, ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా ఈ షోని ఆపడం మాత్రం ఎవ్వరి వల్లా కాదు. అదీ బిగ్‌బాస్ షోకి వున్న క్రేజ్. ఓ రకంగా చెప్పాలంటే, బుల్లితెర ప్రేక్షకులకు ‘బిగ్‌బాస్’ షో ఒక టానిక్, ఒక అడిక్ట్‌లాంటిది.. అనొచ్చేమో.
ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఆరో సీజన్ బిగ్‌బాస్‌ని అంతకు మించి ఎంటర్‌టైన్‌మెంట్.. అనేలా డిజైన్ చేయబోతున్నారట. ఈ సారి హౌస్‌లో సందడి చేయబోయే సెలబ్రిటీస్ వీళ్లే అంటూ, ఈ నేపథ్యంలో హడావిడి కూడా ఆల్రెడీ నెట్టింట మొదలైపోయింది.
గత సీజన్‌లో ట్రాన్స్‌జెండర్ తమన్నా షో అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఐదో సీజన్ బిగ్ బాస్‌లో పింకీ అలియాస్ ప్రియాంక ట్రాన్స్ జెండర్‌గా సక్సెస్ అయ్యింది. ఈ సారి ఆ పాత్రను తన్మయితో రీప్లేస్ చేయబోతున్నారట.
అలాగే, గత సీజన్‌లో పాపులర్ అయిన సిరి హన్మంత్ ప్రియుడు శ్రీహాన్ ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్నాడట. అలాగే ఓ సామాన్యుడికీ ఈ సారి హౌస్‌లో ప్లేస్ వుందంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, ఈ సారి బిగ్‌బాస్ షోకి ఎంత గ్లామర్ అద్దబోతున్నారో.!
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!