సూపర్‌స్టార్‌కి స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్.!
- August 09, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా, ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ పోటెత్తుతున్నాయ్. ఈ నేపథ్యంలో ‘చిన్నారుల గుండె చప్పుడు మహేష్ బాబుకి బర్త్ డే విషెస్.. ’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషెస్ నెట్టింట స్పెషల్‌గా వైరల్ అవుతున్నాయ్.
కాగా, గత కొన్ని రోజులుగా మహేష్ బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్ పేరు చెప్పి ఆయన కెరీర్ బెస్ట్ మూవీస్‌ని తెలుగు రాష్ర్టాల్లో రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలోనే ఈ రోజు, ‘పోకిరి’ సినిమాని హైద్రాబాద్ ఐమాక్స్ ధియేటర్‌లో ప్రదర్శించారు. ‘పోకిరి 4కె వెర్షన్’ పేరుతో ఈ సినిమాని స్పెషల్ షోగా ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ర్టాలు రెండింటిలోనూ, మొత్తం 53 ధియేటర్లలో దాదాపు 100కి పైగా సెంటర్లలో ఈ స్పెషల్ షో ప్రదర్శించబడుతోంది.
అలాగే, హైద్రాబాద్ ఐమాక్స్ ధియేటర్‌లో మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాని సైతం ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోకి దర్శకుడు గుణశేఖర్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాని మళ్లీ వీక్షించారు. అలాగే, హీరోయిన్ భూమిక కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ‘ఒక్కడు’ స్పెషల్ షోని పెద్ద తెరపై చూసి తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







