ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా కొత్త నిబంధనలు
- August 10, 2022
ఢిల్లీ: రుణ ఎగవేతదారులు, ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇతరులతో సహా నేరస్థులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. విదేశాలకు ప్రయాణించే ప్రయాణీకుల వివరాలను వారు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు పంచుకోవాలని విమానయాన సంస్థలను కోరింది. విమానయాన సంస్థలు అందించే సమాచారాన్ని పరిశీలనకు కొత్తగా నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్ - ప్యాసింజర్ (NCTC-P) ను ఏర్పాటు చేసింది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగమని పేర్కొంటూ ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్ 2022కి సంబంధించి నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎయిర్ లైన్స్ ఆపరేటర్ ప్రయాణీకుల రికార్డులను గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్‌లైన్ లేదా ఏజెన్సీ నిబంధనలను పాటించకపోతే రూ.25,000-రూ.50,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఎన్‌సిటిసి-పిని అమలు చేయడంలో ప్రధాన లక్ష్యం బ్యాంకు డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడమని.. గత ఐదేళ్లలో దాదాపు 40 మంది ఆర్థిక నేరగాళ్లు భారతదేశం నుంచి పారిపోయారని ప్రభుత్వం గతంలో పార్లమెంటుకు తెలియజేసింది. వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ (యుకెలో జైలులో ఉన్నారు), మెహుల్ చోక్సీ (డొమినికాలో ఉన్నారు) కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







