‘లాల్ సింగ్ చద్దా’: ఇంట్రెస్టింగ్ అంశాల్ని షేర్ చేసిన చైతూ.!
- August 10, 2022
‘లాల్ సింగ్ చద్దా’ లో చైతూ పాత్ర నిడివి చాలా తక్కువట. కేవలం 20 నిముషాలు మాత్రమే స్క్రీన్‌పై చైతూ కనిపిస్తాడట. కానీ, ఆ పాత్రతో చైతూ క్రియేట్ చేసే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతాడట చైతూ.
తొలిసారి చైతూ నటిస్తున్న హిందీ సినిమా ఇది. ఈ సినిమాలో నటించేందుకు మొదట చాలా భయమేసిందట చైతూకి. ఎందుకంటే, అక్కడున్నది లెజెండరీ స్టార్ ఆమిర్ ఖాన్. ఆయనని మ్యాచ్ చేయడం అంత ఆషామాషీ కాదు.
అంతేకాదు, ఈ సినిమాలో తన పాత్రకి హిందీ వెర్షన్ డబ్బింగ్ కూడా చైతూనే చెప్పుకున్నాడట. హిందీలో తొలిసారి డైలాగులు చెప్పడం చాలా టెన్షన్ వచ్చేసింది.. అని అంటున్నాడు చైతూ.
ఆమిర్ ఖాన్ పాత్రకు తెలుగు వెర్షన్ డబ్బింగ్‌ని హీరో నితిన్‌తో చెప్పించడం ఈ సినిమాకి మరో విశేషం. కాస్త ఇన్నోసెన్స్‌తో కూడిన ఆమిర్ పాత్రకు నితిన్ డబ్బింగ్ కరెక్ట్‌గా సెట్ అయ్యింది. డైరెక్ట్ తెలుగు సినిమా ఫ్లేవర్ అద్దినట్టయ్యింది నితిన్ డబ్బింగ్‌తో.
అలాగే, చైతూ పాత్ర విషయానికి వస్తే, తెలుగు మూలాలున్న అసలు సిసలు ఆంధ్రా కుర్రాడిలా కనిపిస్తాడట. తెలుగు నేటివిటీలో సాగే పాత్ర కావడంతో, పాత్ర పరంగా చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యానని చెబుతున్నాడు చైతూ.
తెలుగులో ‘లాల్ సింగ్ చద్దా’ని మెగాస్టార్ చిరంజీవి సమర్ఫిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ఈ సినిమా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







