కృతి శెట్టికి ‘మాచర్ల’ హిట్ చాలా కీలకమే సుమీ.!
- August 10, 2022
‘ఉప్పెన’ సినిమాతో బేబమ్మగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమా సూపర్ హిట్‌తో పిచ్చ క్రేజ్ దక్కించుకుంది అమ్మడు. క్రేజ్‌తో పాటూ, వరుసగా అవకాశాలు కూడా దక్కించుకుంది.
అయితే, ‘ఉప్పెన’ రేంజ్ హిట్ మాత్రం ఆ తర్వాత కృతి శెట్టి తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఏ సినిమాలో చూసినా కృతి శెట్టినే అన్నట్లుగా కనిపిస్తోంది కానీ, సక్సెస్ వుంటేనే కదా.. అసలు కిక్కు.
‘శ్యామ్ సింఘరాయ్’తో హిట్టు కొట్టినా ఆ హిట్ సాయి పల్లవి ఖాతాలో కొట్టుకెళ్లిపోయింది. ఆ తర్వాత ‘బంగార్రాజు’లో నటించింది. కానీ, అది కూడా ఫ్లాప్ లిస్టులోనే చేరిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ‘ది వారియర్’ కూడా కృతి శెట్టిని ఢీలాపరిచేసింది.
ఇక తాజాగా ‘మాచర్ల నియోజకం వర్గం’తో రాబోతోంది. ఆగస్ట్ 12న ‘మాచర్ల నియోజక వర్గం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది. హిట్టు కళ కనిపిస్తోంది. కానీ, రిలీజ్ అయితే కానీ చెప్పలేం.
ప్రేక్షకుల ఆలోచనలు ఎలా వుంటున్నాయో చెప్పడం కష్టమైపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ పల్స్‌ని పట్టడం కత్తి మీద సామే అవుతోంది దర్శకులకు. అసలే కొత్త డైరెక్టర్. ఎలా డీల్ చేశాడో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఈ సినిమా కానీ, అటూ ఇటూ అయ్యిందంటే, కృతి శెట్టి కెరీర్ డైలమాలో పడిపోయినట్లే మరి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







