28న సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత..

- August 12, 2022 , by Maagulf
28న సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత..

నోయిడా: దేశంలోనే భారీ టవర్స్‌లో ఒకటైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. అక్రమంగా నిర్మించిన ఈ భారీ బిల్డింగ్‌ను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా బిల్డింగ్స్ కూల్చివేతకు అనుమతించింది.

నిబంధనలు ఉల్లంఘించి, అక్రమంగా కట్టిన ఈ బిల్డింగ్స్ కూల్చివేయాలని గతేడాది ఆగష్టులోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ రెండు బిల్డింగ్‌లు నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేను ఆనుకుని ఉన్నాయి. 7.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ రెండింటినీ నిర్మించారు. 32 అంతస్థులు కలిగిన ఈ బిల్డింగుల్లో ఒకటి 103 మీటర్లు ఉంటే, మరో బిల్డింగ్ 97 మీటర్లు ఉంటుంది. గత మేలోనే వీటిని కూల్చాల్సింది.అయితే, వివిధ కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ నెల 28న కూల్చివేసేందుకు నిర్ణయించారు. దీని కోసం చుట్టుపక్కల ఉన్న బిల్డింగుల్లో నివాసం ఉంటున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు.వేరే బిల్డింగులకు నష్టం లేకుండా కూల్చాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం పేలుడు పదార్థాల్ని ఉపయోగించనున్నారు.

దాదాపు 3,700 కేజీల పేలుడు పదార్థాల్ని వాడబోతున్నారు. బిల్డింగ్ మొత్తం 9,000 రంధ్రాలు చేసి, వాటిలో పేలుడు పదార్థాలు అమరుస్తారు.దీనికి తాజాగా కోర్టు అనుమతించింది.ముంబైకి చెందిన ఎడిఫిక్ ఇంజనీరింగ్ సంస్థ ఈ బాధ్యతలు తీసుకుంది.పేలుడు పదార్థాలు ఉపయోగించి బిల్డింగ్ కూల్చడం వల్ల చుట్టుపక్కల పడకుండా, నేరుగా కిందికి కూలిపోతుంది.దీనివల్ల ఇతర బిల్డింగులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com