స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఎర్రకోట..
- August 13, 2022
భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది.ఇటీవలి తీవ్రవాద దాడులతోపాటు,ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు.ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.
వరుసగా మూడో ఏడాది కూడా కరోనా ఆంక్షల మధ్యే వేడుకలు జరగబోతున్నాయి.వీక్షకులు భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రధాని హోదాలో మోదీ ఇక్కడ జెండా ఎగురవేయనుండటం ఇది తొమ్మిదవసారి.ఎర్రకోట చుట్టూ దాదాపు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.చుట్టుపక్కల వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.భద్రత పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్స్, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.100 వరకు పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలు మోహరించాయి.ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్‌జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వార్డ్‌లను మోహరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







