ట్యాంక్ బండ్ పై మళ్లీ సన్‌డే ఫన్‌డే సంబరాలు
- August 13, 2022
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ పై మళ్లీ సండే ఫన్‌డే సంబరాలు మొదలుకాబోతున్నాయి.కరోనా కు ముందు నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేసేవారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్‌సాగర్ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షించేది. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ సందడికి బ్రేక్ పడింది.
కాగా రేపు (ఆదివారం) నుంచి మళ్లీ మొదలుకానున్నాయి.రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ట్యాంక్‌బండ్‌పై సన్‌డే ఫన్‌డే వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రకటించారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఇక దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొనబోతుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







